Civil Engineering: ఎంతోమంది ఆసక్తి చూపుతున్న కోర్సు.. సివిల్ ఇంజినీరింగ్.! 6 d ago

విద్యార్ధి దశలో ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైనది. ఈ క్రమంలో ఇంటర్ తర్వాత ఎంపిక చేసుకునే కోర్సుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత సివిల్ ఇంజినీరింగ్‌తో అందుబాటులో ఉండే అవకాశాలేంటో చూద్దాం.
ఈ రోజుల్లో చాలా మంది యువత ఆసక్తి చూపుతున్న కోర్సు సివిల్ ఇంజినీరింగ్. ఇటీవలి నిర్మాణ రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. సివిల్ ఇంజినీర్లు వంతెన, హైడ్రాలిక్, పర్యవరణ, రవాణా, కలప, సర్వేయింగ్, జియోటెక్నికల్, భూకంపం వంటి రంగాలలో ఏ రంగంలోనైనా తమ కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ అంటే నిర్మాణానికి ముందు నిర్వహించేవి (సాధ్యాసాధ్యాల అధ్యయనాలు, స్ధల పరిశోధనలు మరియు రూపకల్పన) నిర్మణ సమయంలో నిర్వహించేవి (క్లయింట్లు, కన్సల్టింగ్ ఇంజనీర్లు మరియు కాంట్రాక్టర్లతో వ్యవహరించడం), నిర్మాణం తర్వాత నిర్వహించేవి (నిర్వహణ మరియు పరిశోధన)
రాష్ట్రస్ధాయిలో.....
సివిల్ ఇంజినీరింగ్‌ను ఎంచుకోవాలనుకునే వారు ఇంటర్మీడియట్ స్ధాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ తీసుకొని ఆయా సబ్జెక్టుల్లో మంచి ప్రావీణ్యం ఉండాలి. అన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌ల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారానే సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రవేశం కల్పిస్తారు.
జాతీయ స్ధాయిలో......
జాతీయ స్ధాయిలో ఐఐటీ, నిట్‌లు సివిల్ ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలు జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
సివిల్ ఇంజినీర్……
సివిల్ ఇంజనీరింగ్‌లో నిర్మాణ పనుల ప్రణాళిక, రూపకల్పన మరియు అమలుచేయడం వంటివి ఉంటాయి. ఆనకట్టలు, వంతెనలు, జలచరాలు, కాలువలు, రహదారులు, విద్యుత్ ప్లాంట్లు, మురుగునీటి వ్యవస్ధలు ఇతర మౌలిక సదుపాయాలు వంటి సాధారణ ప్రజలకు సేవలందించే నిర్మాణ పనులను రూపొందించడం. సివిల్ ఇంజినీర్ ఒక ప్రాజెక్టును ప్లాన్ చేయడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా రూపకల్పన చేయడం, అవసరమైన స్ధాయికి ప్రాజెక్టును నిర్మించడం, ఉత్పత్తి నిర్వహణ భాద్యత వహిస్తాడు. వీటిలోని ప్రధానమైన స్పెషలైజేషన్లు నిర్మాణ, నీటి వనరులు, పర్యావరణ, నిర్మాణం, రవాణా, జియో-టెక్నికల్ ఇంజనీరింగ్ మొదలైనవి.
సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాక మొదటిది ఉద్యోగం, రెండోది ఉన్నత విద్య. ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంబంధమైనవీ, ప్రభుత్వ రంగ సంస్ధల్లోనివీ ఉంటాయి. రోడ్లు భవనాలు, నీటిపారుదల, పంచాయతీ రాజ్, రూరల్ వాటర్ వర్క్స్, మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వర్క్స్, మైన్స్, విద్యుత్తు శాఖల్లో అవకాశాలు లభిస్తాయి. బోధన రంగంపై ఆసక్తి ఉన్న వారు బీటెక్ విద్యార్హతతో పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగం చేయవచ్చు. విద్యార్ధులు మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా పోటీని తట్టుకోవాలంటే సాంకేతికంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావల్సిన పరిస్ధితులు ఉన్నాయి.
ఇది చదవండి: కెమికల్ ఇంజినీరింగ్‌తో కెరీర్ కి భరోసా